Amaravati: మంత్రాలయం పీఠాధిపతి ఔదార్యం.. అమరావతి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం

by Shiva |
Amaravati: మంత్రాలయం పీఠాధిపతి ఔదార్యం.. అమరావతి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి (Amaravati Capital) నిర్మాణానికి అడుగు పడ్డాయి. ఈ క్రమంలో పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు రాజధాని నిర్మాణానికి తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను ఉండవల్లి (Undavalli) నివాసంలో మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు (Subudendra Tirthulu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మఠం సభ్యులంతా సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ మేరకు మంత్రాలయం తరఫున అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed