- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల.. వైసీపీ నుంచి గుంటూరు పార్లమెంట్ బరిలోకి
దిశ ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పార్లమెంట్ వైసీపీ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. గుంటూరు పార్లమెంట్ ఇన్‌చార్జిగా గతంలో ఉమ్మారెడ్డి వెంకటరమణను పార్టీ నియమించింది. ఆయన పోటీలోకి దిగేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. లేటెస్ట్‌గా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెనుకకు వచ్చి వైసీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే. దీంతో గుంటూరు రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఆర్‌కేను గుంటూరు పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అప్పటి వరకు పోటీ చేసేందుకు సిద్ధమైన వెంకటరమణ పెట్టెబేడా సర్దుకొని హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది.
అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మార్పులు
దీంతో పాటు నియోజకవర్గంలోని పలు సెగ్మెంట్‌లలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్త వారిని దించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు తూర్పు అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆమె ప్రచారం కూడా చేసుకుంటున్నారు. తాడికొండకు సుచరితను ఖరారు చేశారు. మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థి పోటీలోకి దిగనున్నారు. కాండ్రూ కమల, గంజి చిరంజీవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
తెనాలి, పొన్నూరులకు ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చే ఆలోచన లో అధిష్టానం ఉంది. పత్తిపాడుకు కొత్త అభ్యర్థిని నియమించారు. గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి రజనీ ప్రచారంలో ముందున్నారు. ఆర్కే ఎంపీ అభ్యర్థిగా కొత్త టీమ్‌తో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్‌కే గత ఎన్నికలలో మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించారు. ఈసారి కూడా లోకేశ్‌ను ఓడించాలంటూ ఆర్‌కేను నిలుపుతారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఆర్‌కేను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Also Read..
అధిష్టానానికి తలనొప్పిగా మారి ‘జంగా’.. త్వరలో టీడీపీలోకి జంప్!