- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala : తిరుమల భక్తులకు అలర్ట్..భారీ వర్షాల ఎఫెక్ట్
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గం మూసివేస్తూ టీటీడీ(TTD) నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలకు తిరుమల రెండవ ఘాట్ లోని 12 వ మలుపు వద్ద రోడ్డుపై చెట్లు విరిగిపడి బండరాళ్లు అడ్డం పడ్డాయి. దీంతో తిరుమలకు వెళ్ళే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన టీటీడీ సిబ్బంది రోడ్డుకు అడ్డంగా పడ్డ బండరాలను చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. జేసీబీల సహాయంతో వాటిని తొలగించి రాకపోకలు పునరుద్ధరించే పనులు కొనసాగిస్తున్నారు.
ఫెయింజల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని కపిల తీర్ధం, అకాశ గంగ తిరుమల గిరుల్లోని జలపాతాలు వరద నీటితో హోరెత్తుతున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలన్ని పూర్తిగా నిండిపోగా, గోగర్భం జలాశయం గేట్లు ఎత్తి దిగువను నీటిని విడుదల చేస్తున్నారు.