AP News:‘రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు’.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘రైతు సమస్యలపై జగన్ మొసలి కన్నీరు’.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) జీవీ ఆంజనేయులు(Jivi Anjaneyulu) పేర్కొన్నారు. రైతుల పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు(Jivi Anjaneyulu) విమర్శించారు. ఉచిత పంటల బీమా(Free crop insurance) పేరిట రైతులను జగన్(YS Jagan) ముంచారని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో రైతు సమస్యలపై ఆయన మొసలి కన్నీరు మానుకోవాలని చురకలంటించారు. బీమా సంస్థల(insurance companies)కు రూ.1300 కోట్లకు పైగా బకాయిలు పెట్టి, వాటిని మేం కట్టాలనడం శోచనీయమని అన్నారు. సాగును అస్తవ్యస్తం చేసిన జగన్ రైతులను ఆత్మహత్య ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రైతుల సమస్యల పరిష్కారం దిశగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పనిచేస్తోందని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

Advertisement

Next Story