3నెలల తర్వాత గన్‌మెన్లు ఉండరు..బడితపూజ తప్పదు: కొడాలి నానికి బుద్ధా వెంకన్న వార్నింగ్

by Seetharam |
3నెలల తర్వాత గన్‌మెన్లు ఉండరు..బడితపూజ తప్పదు: కొడాలి నానికి బుద్ధా వెంకన్న వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిస్తే అధికార వైసీపీ భయంతో వణికిపోతుందని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమైనప్పటి నుంచి అధికార వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతుందని అన్నారు. ఇద్దరి నేతల కలయికకు భయపడే మాజీమంత్రి కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు అవాక్కులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కలిస్తే మీకెందుకు భయమని నిలదీశారు. మాజీమంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకని మాట్లాడాలని లేకపోతే బడితపూజ తప్పదని గట్టిగా హెచ్చరించారు. మరో మూడు నెలలు ఆగితే... ఇప్పుడు వాగుతున్న వారందరి నోళ్లు మూతపడటం తప్పదని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. ఇలాగే వాగితే వీరికి బుద్ధి వచ్చేలా టీడీపీ కేడర్ గట్టిగా సమాధానం చెప్తోందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మూడు నెలల తర్వాత వీరికి గన్ మెన్లు కూడా ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువనేత నారా లోకేశ్ డైరీలో ఇప్పటికే కొందరి పేర్లు ఉన్నాయని... మరికొన్ని పేర్లు కూడా డైరీలోకి ఎక్కుతాయంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

Advertisement

Next Story