అచ్యుతాపురం ఘటనపై చర్యలు.. ఎసెన్షియా ఫార్మా కంపెనీ మూసివేత

by Ramesh Goud |
అచ్యుతాపురం ఘటనపై చర్యలు.. ఎసెన్షియా ఫార్మా కంపెనీ మూసివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదంలో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై చర్యలు తీసుకున్న అధికారులు ఎసెన్షియా ఫార్మా కంపెనీని మూసివేశారు. అయితే ప్రమాదం జరిగే సమయానికి ఫ్యాక్టరీలో 300 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపధ్యంలోనే ఫార్మా కంపెనీలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే పేలుడు సంభవించిన బ్లాక్ లోకి వెళ్లేందుకు సిబ్బంది భయపడుతున్నారు. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతిని బలహీనంగా తయారయ్యింది. దీంతో ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో దెబ్బతిన్న బ్లాక్ లోకి వెళ్లేందుకు సహాయక సిబ్బంది విముఖత చూపుతున్నారు. కాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం జరిగింది. ఇందులో ఇప్పటికే 18 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారితో పాటు గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed