- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌కు సరైన మొగుడు లోకేశ్: Kinjarapu Atchannaidu
- వారసత్వంతో రాలేదు.. రాష్ట్ర భవిష్యత్ కోసం వస్తున్నాడు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారని.. కానీ జగన్ రెడ్డి లాంటి పిచ్చి, సైకో ముఖ్యమంత్రిని చూడలేదని అలాంటి సీఎంను భరించాల్సి రావడం దౌర్భాగ్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. మూడున్నరేళ్ల పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. నేతలు సైతం నిద్రలేకుండా గడిపారని ఆయన చెప్పారు. అయితే జగన్ లాంటి మూర్ఖుడికి సరైన మొగుడు లోకేశ్ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
నారా లోకేశ్ వారసత్వంతో రావడంలేదని, రాష్ట్ర భవిష్యత్‌ను తిరగరాయాలని నాయకుడిగా వస్తున్నాడని అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేసి 175 నియోజకవర్గాల్లో 20 వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు, తారు రోడ్లు వేసిన ఘనత లోకేశ్‌కే దక్కుతుందన్నారు. రాత్రుళ్లు వీధి లైట్లుగా ఎల్ఈడీ బల్బులు వెలుగుతున్నాయంటే అందుకు కారణం లోకేశ్ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు గుక్కెడు నీళ్లు తాగుతున్నారంటే అందుకు లోకేశ్ నాయకత్వమే కారణమన్నారు. అలాంటి లోకేశ్‌కు అవినీతి అంటించేందుకు జగన్ ప్రయత్నించాడని, తాను అవినీతికి పాల్పడినట్టు భావిస్తే నిరూపించాలని సవాల్ విసిరిన నాయకుడు లోకేశ్ అని కొనియాడారు.
175 స్థానాల్లో గెలుస్తానని జగన్ చెబుతున్నాడని, చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన కుప్పంలో చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నాడని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం ప్రజలేమీ అమాయకులు కాదని, జగన్‌కు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 స్థానాలతో విజయం సాధించడం ఖాయమని, మళ్లీ చంద్రబాబు సీఎం కావడం తథ్యమని అచ్చెన్ననాయుడు ధీమా వ్యక్తం చేశారు.
Read more: