‘నా భార్యను ఆయనే గర్భవతి చేశారు’: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త ఆరోపణ

by Anjali |
‘నా భార్యను ఆయనే గర్భవతి చేశారు’: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త ఆరోపణ
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ‌కు చేసిన ఫిర్యాదు ఉత్తరాంధ్ర వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్‌లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త ఫిర్యాదులో పేర్కొనడం వైసీపీలో ప్రకంపనలకు కారణమైంది. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరుతూ లేఖ రాసిన ఆయన ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారని తెలిసి వైసీపీ నేతలు కలవర పడుతున్నారు.

ఉత్తరాంధ్రా వైసీపీలో సంచలనం..

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పార్టీ అధికారంలో వున్న సమయంలో చాలా ఏళ్లు ఉత్తరాంధ్రా ఇన్చార్జిగా పనిచేశారు. ఆ సమయంలో విజయసాయి రెడ్డిని కలవడానికి వెళ్లిన వారందరికీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కనిపించేవారు. విజయసాయి రెడ్డి విశాఖలో పర్యటనలో వున్న ప్రతిసారీ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ హోదాలో శాంతి ఆయనతో వుంటూ కోటరీగా ముద్ర పడ్డారు. ఆమె దేవాదాయ శాఖలో ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా విజయసాయి రెడ్డి కాపాడుతూ వచ్చారు. విజయసాయి రెడ్డి వెంటేవుంటూ విశాఖ భూ వ్యవహారాలను చక్కపెట్టిన ఆరోపణలు ఎదుర్కొన్న రెవిన్యూ జీపీ సుభాష్ పైనా ఇప్పుడు శాంతి భర్త ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి విశాఖ వచ్చిన ప్రతిసారీ ఆయన వెంటే సుభాష్ కూడా వుండేవారు. ఇదంతా వైసీసీ ఉత్తరాంధ్రా నేతలకు తెలిసిన వ్యవహారమే కావడంతో ఇఫ్పడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయసాయి రెడ్డి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల కంటే శాంతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తమమని, తామే పలు సందర్భాల్లో అవేదన చెందామని నేతలు చెబుతున్నారు.

కేసు నుంచి బయటకు..

శాంతి విశాఖలో పనిచేసిన సమయంలో తానువుండే అపార్ట్‌మెంట్‌ వారితో గొడవ పడ్డారు. తాను కీలకమైన అధికారి నంటూ అధికార దర్పం ప్రదర్శించారు. ఈ గొడవ ముదిరి చివరకు పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది. ఆరిలోవ పోలీసు స్టేషన్‌లో శాంతిపై కేసు నమోదైంది. అయితే, విజయసాయి రెడ్డి అండదండలు పుష్కలంగా వుండడంతో పోలీసులు కూడా ఆమెపై చర్యలు తీసుకొనే ధైర్యం చేయలేకపోయారు.

ఎన్ని ఆరోపణలు వచ్చినా డోంట్ కేర్ ..

విశాఖ దేవాదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిగా శాంతి ముద్ర పడ్డారు. తాను ఏసీ అయివుండి తనపై అధికారి డీసీపై కార్యాలయంలో ఆయనపై శాంతి కోపంతో ఇసుక వేశారు. విచిత్రంగా విజయసాయి రెడ్డి అండతో దాడికి గురైన డీసీ రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఎటువంటి క్రమశిక్షణా లేకుండా శాంతి క్షేమంగా బయటపడ్డారు. దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన రాజు అనే ఇన్‌స్పెక్టర్‌తో కలసి పలు ఆలయాల సందర్శనకు వెళ్లినప్పుడు తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి. అయినా, విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డిల మద్దతుతో ఎవ్వరినీ లెక్క చేయకుండా తన ఇస్టానుసారం విధులు నిర్వర్తించారు. ఇవన్నీ తెలిసిన ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు విజయసాయిని చూసి జాలి పడుతున్నారు. ‘చేసుకొన్నవాడికి చేసుకొన్నంత’ అంటూ పెదవి విరుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed