రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

by sudharani |
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : కడప - తాడిపత్రి హై వే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందింది. ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదవశాత్తు జారిపడిన ముంగపాటి చెన్నమ్మ(46) అనే మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే చెన్నమ్మ ద్విచక్ర వాహనంపై వెళ్తోంది. అయితే ఒక్కసారిగా బైక్‌పై నుంచి కిందకు పడిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఆమెపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చెన్నమ్మ మృతి చెందింది.

మృతురాలు చెన్నమ్మది వల్లూరు మండలం వెంకటాపురం వీవర్స్ కాలనీగా గుర్తించారు. ఈమెకు ఇద్దరమ్మాయిలు ఒకబ్బాయి సంతానం. ఇదివరకే ఇద్దరు ఆడ పిల్లలకు వివాహం చేయగా మూడు రోజుల క్రితం కుమారుడికి సైతం ఆమె వివాహం చేసింది. ఇలాంటి తరుణంలో చెన్నమ్మ ప్రమాదవశాత్తు మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story