- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎంతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారు. శనివారం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు వెళ్లారు. లండన్‌లో ఆయనకు అక్కడి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో సెల్ఫీలు దిగేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజులు ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. కాగా, సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరారు. గతంలో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు విధించింది.. వాటిని సడలించాలని జగన్ కోరారు. ఈ పర్యటనలో భాగంగా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 13న పోలింగ్ పూర్తికాగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే.