రాజధానిలో IIT Madras Experts team పర్యటన.. నేడు ఆ బిల్డింగ్స్ పరిశీలన

by srinivas |
రాజధానిలో  IIT Madras Experts team పర్యటన.. నేడు ఆ బిల్డింగ్స్ పరిశీలన
X

దిశ, ఏపీ బ్యూరో అమరావతి: అమరావతి రాజధానిలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. సెక్రటేరియట్, హెచ్ వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజినీర్లు అధ్యయనం చేయనున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ బృందం అధికారులు పరిశీలించింది. గత టిడిపి ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తి అయింది. ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ నీటిలో నానుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి రెండు బృందాలు నివేదిక అందించనున్నాయి.

Advertisement

Next Story