రిజల్ట్స్ చూసుకోకుండానే ఇంట్లో నుంచి పారిపోయిన విద్యార్థి.. వచ్చిన మార్కులు చూసి పేరెంట్స్ షాక్!

by Anjali |   ( Updated:2023-04-27 06:26:03.0  )
రిజల్ట్స్ చూసుకోకుండానే ఇంట్లో నుంచి పారిపోయిన విద్యార్థి.. వచ్చిన మార్కులు చూసి పేరెంట్స్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన మామిండ్ల అనిరుధ్(16) ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. కాగా పరీక్ష ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 26)న విడుదల చేయడం జరిగింది. దీంతో ఆ విద్యార్థి రిజల్ట్ రాకముందే..‘‘అమ్మ నాన్న, ఉపాధ్యాయులు మీరు అనుకున్నట్లుగా నేను మంచి మార్కులు స్కోరు చేయలేకపోవచ్చు. కనుక నేను చాలా షేమ్‌గా ఫీల్ అవుతున్నా. అందుకని నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా’’ అంటూ అతడు ఉత్తరం రాసి.. ఇంటి నుంచి పారిపోయాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ చెక్ చేయగా.. 470/275 మార్కులు వచ్చాయి. ఆ అబ్బాయి పాసయ్యాడు. ప్రస్తుతం కుటుంబసభ్యులు అనిరుధ్ కోసం వెతకడం ప్రారంభించాడు.

Advertisement

Next Story