Breaking: ఉమ్మడి ఏపీ సచివాలయం ఉద్యోగులకు షాక్.. తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే

by srinivas |   ( Updated:2024-04-29 14:29:57.0  )
Breaking: ఉమ్మడి ఏపీ సచివాలయం ఉద్యోగులకు షాక్.. తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయం ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల స్థలాల కేటాయింపుపై ధర్మాసనం స్టే విధించింది. సచివాలయ ఉద్యోగులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఆదేశించింది. 155 ఎకరాలను ప్రభుత్వం రూ. 3 కోట్ల నామ మాత్ర ధరకు కేటాయించింది. రూ.1500 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు ఇవ్వడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు కూడా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ సచివాలయం ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై స్టే విధించింది.

కాగా ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నెక్ నాంపూర్‌లో 55 ఎకరాలు, శామీర్‌పేట మండలం జవహర్ నగర్‌లో 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన 509 జీవోను కూడా జారీ చేసింది. అయితే ఆ సొసైటీకి భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అయితే ఈ పిటిషన్‌ను జనవరిలో హైకోర్టు కొట్టివేసింది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని సమర్థించింది. దీంతో పిటిషనర్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read More...

TS : నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్కో MP స్థానంలో ఎంత మంది పోటీలో ఉన్నారంటే..?

Advertisement

Next Story