70 గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజీకి రెండవ ప్రమాద హెచ్చరిక

by Mahesh |
70 గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజీకి రెండవ ప్రమాద హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్సాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నది భీకర స్థాయిలో ప్రవహిస్తూ.. సముద్రం వైపు ఎరుపెక్కి దూకుతుంది. ముఖ్యంగా నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదులుతున్నారు. గంట గంటకు వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం.. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6,96,178 క్యూసెక్కులు ఉండగా.. బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం 16.7 అడుగులకు గాను పూర్తి స్థాయిలో నిండిపోయింది.

Advertisement

Next Story

Most Viewed