AP News:అమరావతి నిర్మాణానికి హైదరాబాద్ నివాసి భారీ విరాళం

by Jakkula Mamatha |
AP News:అమరావతి నిర్మాణానికి హైదరాబాద్ నివాసి భారీ విరాళం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో నేడు(మంగళవారం) కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమారై పి.విజయలక్ష్మి సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను కలిశారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదారాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో రూ.కోటి ఇచ్చామన్నారు. తమ తల్లి ఇందిరాదేవికి ఆత్మశాంతి కలిగేలా ఆవిడ కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో తమకున్న కొద్ది స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్టు పి.విజయలక్ష్మి చెప్పారు. పి.విజయలక్ష్మి త్యాగనిరతిని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. స్థలం అమ్మి తల్లి పేరిట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed