Srisailam Temple:శ్రీశైలం మల్లన్న ఆలయానికి అరుదైన పురస్కారం

by Jakkula Mamatha |
Srisailam Temple:శ్రీశైలం మల్లన్న ఆలయానికి అరుదైన పురస్కారం
X

దిశ,వెబ్‌డెస్క్:నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటుంటారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవారి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తుంటారు.

అయితే జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ విస్తీర్ణం..ఆలయంలోని నంది విగ్రహానికి ఉన్న చరిత్ర, పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందున ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ పుణ్యక్షేత్రానికి చోటు లభించింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ అల్లాజీ ఎలియజర్ పత్రాన్ని అందజేశారు. గతంలోనూ ఈ దేవస్థానం ఏడు విభాగాలకు ISO ద్వారా ధ్రువీకరణ పత్రం అందుకుంది.

Advertisement

Next Story

Most Viewed