ఏపీకి తప్పిన ముప్పు..ఊపిరి పీల్చుకున్న జనం

by Seetharam |   ( Updated:2023-11-17 06:43:04.0  )
ఏపీకి తప్పిన ముప్పు..ఊపిరి పీల్చుకున్న జనం
X

దిశ, డైనమిక్ బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడిన సంగతి తెలిసిందే. ఈ మిథిలీ తుఫాన్ బంగ్లాదేశ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాట నుంది. దీంతో ఈ తుఫాను ప్రభావం ఏపీపై ఉండదని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ మిథిలి తుపాను ఒడిశాలోని పరదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 20 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ తుఫాను నవంబరు 18 తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాటనుంది అని ఐఎండీ అమరావతి విభాగం స్పష్టం చేసింది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 80 కి.మీ పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ తుఫాను ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

Next Story