- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Liquor Policy: మద్యం దుకాణాలకు లాటరీ ప్రక్రియ షురూ
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి లాటరీ తీస్తున్నారు. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీస్తున్నారు. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
ఇక రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ(New Liquor Policy)ని ఈ నెల 16 నుంచి అమలు చేయనున్నారు.. గత ఐదేళ్లలో మద్యంపై ప్రభుత్వమే అమ్మకాలు జరిపింది. దీంతో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కొత్త పాలసీని తీసుకురావాలని, తక్కువ ధర(Low Price)కే మద్యం అమ్మకాలు జరగాలని నిర్ణయించింది. ప్రైవేటు విధానం(Private Policy)అమలుకు కసరత్తులు పూర్తి చేసింది. ఈ మేరకు మద్యం దుకాణాల(Liquor Stores)కు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి.