బొత్సను ఓడించేందుకు TDP మాస్టర్ ప్లాన్.. MLC అభ్యర్థిగా కీలక నేత!

by Gantepaka Srikanth |
బొత్సను ఓడించేందుకు TDP మాస్టర్ ప్లాన్.. MLC అభ్యర్థిగా కీలక నేత!
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వైపీసీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికపై చర్చించేందుకు పల్లా శ్రీనివాస్ ఇంట్లో సోమవారం టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో అరకు, పాడేరు వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై దృష్టి పెట్టారు. సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. మొత్తంగా ఈ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.


అంతేకాదు.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్‌ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. రాజకీయంగా అనుభవజ్ఞుడు, ఆర్థికంగా బలంగా ఉండటంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న జరిగే ఎన్నికకు 6వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మరోవైపు అధికార పక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నామినేషన్ల ప్రకియ్రకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే తమ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను జగన్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స మాత్రమే నెగ్గుకురాగలరనే అంచనాతో ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story