- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి ఎంపీ..!
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీకి ఓ ఎంపీ రాజీనామా చేయబోతున్నారు. అంతేకాకుండా ఓ పార్టీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఆయనెవరో కాదు.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి భారీ మెజార్టీతో నరసరావు పేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయులు గెలిచారు. ఈ ఐదేళ్లలో ఆయన క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అటు లోక్‌సభలోనూ పలు సమస్యలపై పోరాటం చేశారు. అయితే వైసీపీ ఇంచార్జుల మార్పుల్లో ఆయనకు హైకమాండ్ స్థానచలనం కలిగించబోతోంది. దీంతో లావు కృష్ణదేవరాయలు అసంతృప్తిగా ఉన్నారు. సీఎం జగన్‌తో చర్చించినప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే అధినేత చంద్రబాబును లావు శ్రీకృష్ణదేవరాయులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారని ప్రచారం జరుగుతోంది. దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపినట్లు సమాచారం. నరసరావుపేట తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారట. అయితే నరసరావుపేట లేదా గుంటూరు ఎంపీగా పోటీ చేసే నిర్ణయం లావు శ్రీకృష్ణదేవరాయులకే చంద్రబాబు వదిలేశారని తెలుస్తోంది. మరోవైపు గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కూడా లావు శ్రీకృష్ణదేవరాయులకు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణ దేవరాయులతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు కూడా టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడి త్వరలో లావు శ్రీకృష్ణదేవరాయులు తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలుస్తోంది. దీంతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందని తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో...!