- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాబాయ్ హామీ.. అబ్బాయ్ కీలక నిర్ణయం
దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఓ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఈ మేరకు సినీనటుడు రాంచరణ్, ఆయన భార్య ఉపాసన కామినేనిలు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాలను కొనుగోలు చేశారు. రెండు ఎకరాలలో ఆసుపత్రి నిర్మాణంతో పాటు మిగిలి నదంతా ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని రామ్ చరణ్ ఉపాసన దంపతులు భావిస్తున్నారు.
త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారు. అపోలో లైఫ్ సంస్థల చైర్ పర్సన్ ఉపాసన అధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ అసుపత్రి ఏర్పాటయ్యే అవకాశాలు న్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అపోలో ఆసుపత్రులు వైద్య సేవలను అందిస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖ హాస్పిటల్ చైన్‌గా కూడా అపోలో సంస్థలకు పేరుంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు కూడా ఒక సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరగనుంది. పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముందు పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తామని ప్రకటించారు.
Read more...
సోదర సోదరిమనులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్