- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap High court: రుషికొండ నిర్మాణాలపై విచారణ వాయిదా
దిశ, వెబ్ డెస్క్: రుషికొండలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతోందని ఓ పార్టీ నేత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను కేంద్రం తరపు న్యాయవాదికి అందజేశారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
కాగా మూడు రాజధానుల్లో భాగంగా సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన అందించాలని నిర్ణయించారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీసుతో పాటు పలు కార్యాలయాలను విశాఖ రుషికొండలో నిర్మిస్తున్నారు.ఈ మేరకు రుషికొండలో కొంత భాగం తవ్వి సదరం చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో రిషికొండపై అక్రమాలు జరుగుతున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రుషికొండలో తవ్విన దెబ్రిస్‌ను సముద్రంలో వేయడం సీఆర్‌జెడ్ నిబంధనలకు వ్యతిరేకమని పిటిషన్‌లో తెలిపారు. సీఆర్ జెడ్ పరిధిలో భూగర్భజలాల వినియోగంలోనూ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రుషికొండలో జరుగుతున్న అక్రమాలను సాక్షాధారాలతో సహా కోర్టుకు అందజేశారు. అంతేకాదు రుషికొండలో జరుగుతున్న అక్రమాలను పరిశీలించేందుకు నియమించిన కమిటీకి తన వద్ద ఉన్న సాక్షాధారాలు అందించేందుకు అనుమతివ్వాలని మూర్తి యాదవ్ పిటిషన్‌లో కోరారు.
ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం జనసేన నేత మూర్తి యాదవ్ అందించిన సాక్ష్యాధారాలను కమిటీకి పంపాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా రుషికొండలో కమిటీ పర్యటన పూర్తి అయిందని కోర్టును కేంద్రప్రభుత్వ న్యాయవాది వివరించారు. దీంతో ఈ నెల 27కు విచారణను కోర్టు వాయిదా వేసింది.