పుట్టపర్తిలో భారీ వర్షం.. చిత్రావతి చెక్ డ్యామ్‌ని పరిశీలించిన మాజీ మంత్రి

by Jakkula Mamatha |   ( Updated:2024-10-17 10:41:19.0  )
పుట్టపర్తిలో భారీ వర్షం.. చిత్రావతి చెక్ డ్యామ్‌ని పరిశీలించిన మాజీ మంత్రి
X

దిశ ప్రతినిధి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొట్టింది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా చిన్న చిన్న నీటి కుంటలు వాగులు వంకలు, సాహెబ్ చెరువు పూర్తిగా నిండుకొని మరువ పాడుతుంది. ఆమగొండపాలెం అటవీ ప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రాయలవారిపల్లి చెక్ డ్యామ్, కోవెల గుట్టపల్లి చెక్ డ్యామ్ తోపాటు చిత్రావతి చెక్ డ్యామ్ నిండింది. పుట్టపర్తి పట్టణ సమీపాన ఉన్న చెక్ డ్యామ్ నిండుకోవడంతో జలకళ సంతరించుకుంది.

చిత్రావతి పరవళ్ళు తిలకించడానికి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు నది వద్దకు చేరుకోవడంతో కోలాహలం నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం నీరు చిత్రావతి నది మీదుగా జిల్లాలో అతిపెద్ద చెరువు అయినా బుక్కపట్నం చెరువులోకి నీరు చేరుతుంది. దీంతో బుక్కపట్నం పుట్టపర్తి కొత్త చెరువు మండలాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు చిత్రావతి నది తిలకించడానికి నది పరివాహ ప్రాంతానికి చేరుకున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సైతం తన అనుచరులతో కలిసి చిత్రావతి నదిని సందర్శించారు.

Advertisement

Next Story
null