మహిళలను అన్ని రకాలుగా అణచివేసింది కేసీఆర్ కాదా..? హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్ ఫైర్

by Ramesh N |
మహిళలను అన్ని రకాలుగా అణచివేసింది కేసీఆర్ కాదా..? హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలను పట్టించుకోకుండా అన్ని రకాలుగా అణిచివేసింది కేసీఆర్ కాదా? వారి నాయకత్వంలో మీరు పని చేశారు.. అంటూ హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తాజాగా వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని, నేడు మహిళల పట్ల ప్రేమ ఉన్నట్లు హరీశ్‌రావు తెగ మాట్లాడుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వలేదన్నారు. గత పాలనలో మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారని, అభయ హస్తాన్ని ఎత్తివేశారని ఇవ్వన్నీ ఒకసారి హరీశ్‌రావు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. బతుకమ్మ చీరలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న మాజీ మంత్రి.. మీరు ఇచ్చిన చీరలు పాత ఇనుప సామాన్లుకు, పొలాల్లో పక్షుల కోసం కట్టారు.. ఇవన్నీ తెలంగాణ అక్కా చెల్లెమ్మలకు తెలుసన్నారు.

మహిళలపై తాము అపారమైన ప్రేమ చూపుతున్నామని, మహిళా సాధికారత, వారిని ఉన్నతంగా గౌరవించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. రూ. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. మహిళల పేరిట హెల్త్ డిజిటల్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ బిడ్డ సీతక్క, బీసీ కమ్యూనిటీ నుంచి కొండా సురేఖ ఇద్దరు మహిళలకు మంత్రి పదవి ఇచ్చినట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు హరీశ్‌కరావు, కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed