కాలువలో శవమై తేలిన ముక్కుపచ్చలారని చిన్నారి

by srinivas |
కాలువలో శవమై తేలిన ముక్కుపచ్చలారని చిన్నారి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరులో కిడ్నాప్‌కు గురైన ఏడాదిన్నర చిన్నారి హారిక కథ విషాదంతమైంది. రెండు రోజుల క్రితం ఇంటిలోని ఊయలలో మాయమైన చిన్నారి హారిక తిరిగి వస్తుందనుకుంటున్న తల్లిదండ్రులను శోకంలోకి నెట్టేసింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి సమీపంలోని సర్వేపల్లి కాలువలో శవమై తేలడం అందర్నీ కలచివేసింది.చిన్నారి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు కాలువ నుంచి బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలో రోదిస్తున్న తీరు అందర్నీ కంటతడిపెట్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు నగరంలోని గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పాప హారిక ఇంట్లో ఊయలలో నుంచి మిస్ అయ్యింది. ఊయలలో బొమ్మను ఉంచి పాపను గుర్తు తెలియని దుండుగులు ఎత్తుకెళ్లారు.

దీంతో పాప తల్లిదండ్రులు అనూష, మణికంఠ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాలాజీనగర్ సీఐ నాయక్‌ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మంగళవారం అర్థరాత్రి సర్వేపల్లి కాలువలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈవిషయం తెలుసుకున్న నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ నాయక్‌లు గజ ఈతగాళ్ల సాయంతో సర్వేపల్లి కాలువలో వెతికించారు. గత ఈతగాళ్లు అర్థరాత్రి దాటిన తర్వాత చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. అయితే చిన్నారి హారిక హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్త సంబంధీకులే ఈ హత్యకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రక్తసంబంధీకులే నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి సర్వేపల్లి కాలవలో పడేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చిన్నారిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story