- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూటమి అధికారంలోకి వస్తే పవన్‌కి బంపర్ ఆఫర్..మోడీ కీలక నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతోంది. అయితే ఫలితాల కంటే ముందుగానే పవన్ వద్ద బీజేపీ రెండు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఫలితాల తర్వాత నిర్ణయం ఏపీలో భవిష్యత్ లో పార్టీ ఎదగాలంటే పవన్ మద్దతు అవసరమని బీజేపీ నాయకత్వం గుర్తించినట్లు సమాచారం.
ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ రాష్ట్రానికి పరిమితం కానున్నారు. కూటమికి అధికారం దక్కకుంటే మాత్రం పవన్‌తో కలిసి ఏపీలో బలోపేతం కావాలనేది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కూటమికి అధికారం దక్కకపోతే పవన్‌ను కేంద్రంలో మోడీ కేబినెట్‌లో సహాయ మంత్రిని చేయాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదన పైన పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది.