ప్రభుత్వానికి లిక్కర్ కిక్కు.. 75 రోజుల్లోనే రూ.6,312 కోట్ల అమ్మకాలు

by Mahesh |
ప్రభుత్వానికి లిక్కర్ కిక్కు.. 75 రోజుల్లోనే రూ.6,312 కోట్ల అమ్మకాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం(coalition government).. మద్యం అమ్మకాల్లో(Liquor sales) సమూల మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అందుబాటులో ఉంచిన బ్రాండ్లను పూర్తిగా రద్దు చేసి.. వాటి స్థానంలో.. 2019కి ముందు అందుబాటులో ఉన్న పాత బ్రాండ్లను.. తక్కువ ధరలకు నాన్యమైన మద్యం నినాదంతో సర్కార్ తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి లిక్కర్ కిక్కు(Liquor kick) భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్త మద్యం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అంటే గడిచిన 75 రోజుల్లో ఏకంగా 6,312 కోట్లు అమ్ముడైనట్లు నివేదికలు వచ్చాయి. కాగా రాష్ట్రంలో అక్టోబర్‌ 16 నుంచి కొత్త వైన్‌ షాపులు అమల్లోకి వచ్చాయి. అయితే కేవలం 73 రోజుల్లో ఇంత మొత్తంగా ఆదాయం వస్తే.. న్యూయర్.. ఏప్పీ ప్రజల పెద్ద పండుగ అయిన సంక్రాంతి, ఉగాది పండుగలకు ఏ రేంజ్ అమ్మకాలు జరుగుతాయోనని.. నేటిజన్ల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed