‘వరద బాధితులకు సహాయార్థం’.. ఒక్కో ప్యాకెట్‌లో ఐదు రకాల ఆహార పదార్థాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-06 12:18:15.0  )
‘వరద బాధితులకు సహాయార్థం’.. ఒక్కో ప్యాకెట్‌లో ఐదు రకాల ఆహార పదార్థాలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక విజయవాడ(Vijayawada)ను వరద నీరు ముంచెత్తింది. అయితే వరద నీటితో అల్లాడిపోయిన బెజవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద(Flood) నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

బాధితుల కోసం పలు రకాల ఆహార పదార్థాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్యాకెట్లు తయారు చేయించి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్యాకింగ్, పంపిణీ తీరును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ..ఒక్కో ప్యాకెట్‌లో 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉన్నాయని తెలిపారు. నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను కూడా అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో మరో 24 గంటల్లో పారిశుద్ధ్యం పనులు కూడా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed