5నిమిషాలు.. 5 కోట్ల ఆంధ్రులు.. వినూత్న నిరసనకు పిలుపునిచ్చిన నారా లోకేష్

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-14 08:46:30.0  )
5నిమిషాలు.. 5 కోట్ల ఆంధ్రులు.. వినూత్న నిరసనకు పిలుపునిచ్చిన నారా లోకేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్కిల్ స్కాంలో టీడీపీ అగ్రనేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. టీడీపీ అగ్రనేత, జనరల్ సెక్రటరీ నారా లోకేష్ రేపు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించి, న్యాయానికి సంకెళ్లు వేసిన పిచ్చి జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (15వ తేదీ) రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలు మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను, గుడ్డతో నైనా కట్టుకొని నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించండన్నారు. ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 5 నిమిషాల పాటు.. 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా.. చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతూ.. గుడ్డలతో సంకెళ్లు వేసుకోని ఇళ్లు, వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి పిచ్చి జగన్‌కి చూపించాలని తెలిపారు.

Advertisement

Next Story