36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు.. 176 పునరావాస కేంద్రాలు

by M.Rajitha |
36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు.. 176 పునరావాస కేంద్రాలు
X

దిశ, వెబ్ డెస్క్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టాలపై అధికారక ప్రకటన విడుదల చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 19 మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. 1,808 కిమీ మేర పొడవున రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 1,72,542 హెక్టార్ల వరి పంట, 14,959 హెక్టార్ల ఉద్యాన పంటలు పూర్తిగా నీటిలో మునిగాయి. ఇక 176 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 41,927 మందికి పునరావాసం కల్పించారు. వీరందరి కోసం 171 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వరద బాధితుల కోసం 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సిద్దం చేశారు. వీటిని ఎప్పటికప్పుడు అందించేందుకు అధికారులు, సిబ్బందే కాకుండా, పదుల సంఖ్యలో డ్రోన్లు, 5 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. 188 బోట్లు, 283 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు. అత్యవసర సహాయానికి 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్టు ఏపీ విపత్తు నిర్వహణ అధికారులు తెలియ జేశారు.

Next Story

Most Viewed