జనవరి 2024 జాబ్‌ క్యాలండర్‌ ప్రకటించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

by Seetharam |
జనవరి 2024 జాబ్‌ క్యాలండర్‌ ప్రకటించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల నోటిఫికేషన్‌పై సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది.నామమాత్రపు పోస్టులకే నోటిఫికేషన్‌ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ప్రకటించి భర్తీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు గత 5ఏళ్లుగా ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గ్రూప్‌-I,గ్రూప్-II ఉద్యోగార్దులు గత నాలుగున్నరేళ్లుగా ఎదురుచూసి వయసు మీరిపోయినవారు కూడా ఉన్నారని తెలిపారు. వేలాది పోస్టులు ఖాళీలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిసెంబర్‌ 7న గ్రూప్‌ II ` 897 పోస్టులకు, డిసెంబర్‌ 8న గ్రూప్‌ I ` 81 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లు చూసి లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశ చెందారు అని తెలిపారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తానని ఊరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ప్రకటించలేదు అని నిలదీశారు. రాష్ట్రంలో 18 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాహక్కు చట్ట ప్రకారం 40 వేలు ఖాళీలున్నాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇంకా వచ్చే సంవత్సరం 12 వేల మంది రిటైర్‌ అవుతారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు నింపుతామని, మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటిస్తామని మీరిచ్చిన హామీ ఇంత వరకు నెరవేరలేదు అని సీఎం జగన్‌కు లేఖ ద్వారా గుర్తు చేశారు. ఏజెన్సీ బాషా వలంటీర్లు నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నా వారిని రెగ్యులరైజ్‌ చేయలేదు అని గుర్తు చేశారు. పోలీసు ఉద్యోగాలు వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఎస్‌ఐ-411, కానిస్టేబుల్‌-6100 పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చింది అని తెలిపారు. ఎస్‌.ఐ.పోస్టుల సెలక్షన్‌ అవకతవకల్లో కోర్టు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి

రాష్ట్ర ప్రభుత్వం 2024 జాబ్‌ కేలండర్‌ ప్రకటించాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నాటికి పోస్టులన్నీ భర్తీ అయ్యేట్లు టైమ్‌టేబుల్‌ ప్రకటించి భర్తీ చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న గ్రూప్‌ I, గ్రూప్ II పోస్టులను ప్రకటించి, ఫిబ్రవరిలోగా భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు. వయోపరిమితి అర్హతను 47 సంవత్సరాలకు పెంచాలి అని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీలున్న టీచర్‌ పోస్టులన్నీ భర్తీ చేయాలి అని సూచించారు. గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఏజెన్సీ బాషా వలంటీర్లను రెగ్యులరైజ్‌ చేయాలి అని లేఖలో కోరారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయాలి అని కోరారు. అ పోస్టులకు వెంటనే టైమ్‌టేబుల్‌ ప్రకటించి ఫిబ్రవరి 2024లోగా భర్తీ చేయాలి అని కోరారు. 2024 పూర్తిస్థాయి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌ ద్వారా పేద విద్యార్ధులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు కోరారు.

Advertisement

Next Story