అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లి.. దొరికిపోయిన ఏపీ యువకులు

by Hajipasha |
అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లి.. దొరికిపోయిన ఏపీ యువకులు
X

దిశ, నేషనల్ బ్యూరో : ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకను చూసేందుకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు ఏపీ వాస్తవ్యులపై కేసు నమోదైంది. యువ యూట్యూబర్ వెంకటేష్ నరసయ్య(26), లుకం మహ్మద్ షఫీ షేక్ (28) అనే మరో వ్యక్తి కలిసి ముంబైకి వచ్చారు. ఇతర అతిథులతో కలిసి వారిద్దరు ఈనెల 12వ తేదీన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు.

వారిపై అనుమానం రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఆహ్వానం లేకున్నా పెళ్లి వేదిక వద్దకు వెళ్లేందుకు యత్నించినందుకు నరసయ్య, షఫీలపై పోలీసులు ట్రెస్ పాస్ కేసు నమోదు చేశారు. తదుపరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారిద్దరికి నోటీసులిచ్చి విడుదల చేశారు.

Advertisement

Next Story