చంపేస్తామని బెదిరిస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే అనుచరులపై టీడీపీ నేత ఫిర్యాదు

by Prasanna |   ( Updated:2023-03-28 08:59:07.0  )
చంపేస్తామని బెదిరిస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే అనుచరులపై టీడీపీ నేత ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అనుచరులు తనను చంపుతానని బెదిరిస్తున్నారని పామర్రు టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్ రాజా ఆరోపించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పామర్రు నియోజకవర్గంలో లోపించిన శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. అడ్డాడ గ్రామంలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అనుచరులు గ్రామ చెరువులో మట్టిని అక్రమంగా దోచుకునేందుకు దేవత విగ్రహాన్ని సైతం పక్కకు తొలగించారని ఆరోపించారు. దేవత విగ్రహం విషయంలో అపచారానికి పాల్పడటం, అక్రమంగా మట్టిని కాజేయడాన్ని ప్రశ్నించినందుకు తమను చంపేస్తామంటూ ఎమ్మెల్యే అనుచరులు వీడియో మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్న ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలను అరికట్టాలని, చెరువు తవ్వకం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జాషువాను డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed