చంద్రబాబు అవినీతి‌పరుడు.. నారా భువనేశ్వరిపై నటుడు Posani Krishna Murali ఆగ్రహం

by srinivas |   ( Updated:2023-09-16 16:29:09.0  )
చంద్రబాబు అవినీతి‌పరుడు..  నారా భువనేశ్వరిపై నటుడు Posani Krishna Murali ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా భువనేశ్వరి రాజమండ్రి జైలులో ములాఖత్ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో జైలు అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. తన భర్త చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించారని నారా భువనేశ్వరి అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పోసాని కృష్ణమురళి తప్పుబట్టారు. తమ భర్త చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజలకోసమేనా అని పోసాని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిందీ ప్రజలకోసమేనా అని నిలదీశారు. ఎవరైతే నిజంగా ప్రజలను ప్రేమిస్తారో వారే పదవిలో కూర్చుంటారని పోసాని పేర్కొన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి అవినీతి పరుడని ఆరోపించారు. ఎయిర్‌పోర్టులో జగన్‌ను పొడిచినా గట్టివారు కాబట్టే బతికారని.. కానీ తన లాంటి వారైతే చనిపోయి ఉండేవారని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story