సుజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించాలి: మందకృష్ణ మాదిగ

by srinivas |   ( Updated:2024-05-11 15:06:14.0  )
సుజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించాలి: మందకృష్ణ మాదిగ
X

దిశ, వెబ్ డెస్క్: సుజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించాలని మందకృష్ణ మాదిగ కోరారు. విజయవాడ పశ్చిమం నుంచి బీజేపీ కూటమి అభ్యర్థిగా సుజనా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సుజనా చౌదరికి మద్దతుగా మందకృష్ణ మాదిగ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా సుజనా చౌదరికి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎన్టీయే కూటమితో సాధ్యమవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని మందకృష్ణ మండిపడ్డారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తనకు సోదరుడి కంటే ఎక్కువ అని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు.. అఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగకు తనకు 25 ఏళ్ల నుంచి అనుబంధం ఉందని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగల సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చౌదరి తెలిపారు.

Read More..

36 గంటల్లో ఎన్నికలు..50 వేల ఓట్ల మెజార్టీపై సురేంద్రబాబు కన్ను

Advertisement

Next Story