- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మొదలైన 1000 రూపాయల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1000 రూపాయల పంపిణీ పథకం నేటి నుంచి ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ విధించిన నేపధ్యంలో వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలి, వ్యవసాయ పనులు లేక పస్తులుంటున్నారు. వారందరి ఇబ్బందిని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌తో పాటు వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. ఇందుకనుగుణంగా నేడు వెయ్యిరూపాయల పంపినీ ఆరంభించారు. ఉదయం నుంచే గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందచేస్తున్నారు. దీనితో పాటు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో కోటి 30 లక్షల కుటుంబాలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందనుంది. గత నెల 29 నుంచి ఉచితంగా బియ్యం, కందిపప్పు, పంచదారను అందజేశారు. ఇప్పుడు 1,000 రూపాయల నగదు అందజేస్తున్నారు.
ఇక జిల్లా వారీగా లబ్దిదారుల వివరాల్లోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లాలో 7.5 లక్షల మందికి 75.06 కోట్లు, విజయనగరం జిల్లాలో 6.47 లక్షల మందికి 64.79 కోట్లు, విశాఖ జిల్లాలో 11.05 లక్షల మందికి 110.56 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 14.65 లక్షల మందికి 146.54 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 11.44 లక్షల మందికి 114.48 కోట్లు, కృష్ణా జిల్లాలో 11.21 లక్షల మందికి 112.10 కోట్లు, గుంటూరు జిల్లాలో 12.87 లక్షల మందికి 128.70 కోట్లు, ప్రకాశం జిల్లాలో 8.76 లక్షల మందికి 87.66 కోట్లు, నెల్లూరు జిల్లాలో 7.76 లక్షల మందికి 77.69 కోట్లు, చిత్తూరు జిల్లాలో 9.92 లక్షల మందికి 99.21 కోట్లు, అనంతపురం జిల్లాలో 10.67 లక్షల మందికి 106.79 కోట్లు, కర్నూలు జిల్లాలో 10.56 లక్షల మందికి 105.67 కోట్లు, కడప జిల్లాలో 7.06 లక్షల మందికి 70.69 కోట్లు పంపిణీ చేయనున్నారు.
Tags: andhra pradesh government, ap, bpl people, ration, 1000 rupees benefit, corona help