ఆంధ్రా – ఒడిశాల మధ్య సమస్యల పరిష్కారానికి ముందడుగు..

by srinivas |
jagan, naveen patnaik
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలతోపాటు కొఠియా గ్రామాల సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీని ఏర్పాటైంది. ఏపీ సీఎస్, ఒడిశా సీఎస్‌ల నేతృత్వంలో ఈ జాయింట్ కమిటీ పనిచేయనుంది. ఇకపోతే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం భువనేశ్వర్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం, కొఠియా గ్రామాలపై సీఎం వైఎస్ జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇరువురు ముఖ్యమంత్రులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో జాయింట్ కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Advertisement

Next Story