- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాపై చెప్పులు విసిరారు.. నేను ఉమెన్స్ డే ఎలా జరుపుకోవాలి : యాంకర్ రష్మి
దిశ, సినిమా: ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా సెలబ్రిటీల విషెస్, వీడియోస్‌తో నిండిపోగా.. యాంకర్ రష్మీ గౌతమ్ మాత్రం తను ఉమెన్స్ డే హ్యాపీగా జరుపుకోలేకపోతున్నాను అంటూ ఓ వీడియో షేర్ చేసింది. లాక్ డౌన్ కాలం నుంచి స్ట్రీట్ డాగ్స్‌ను ఫీడ్ చేస్తున్న రష్మి.. అప్పటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో స్ట్రీట్ డాగ్స్‌ను ఫీడ్ చేస్తున్న మహిళను అసభ్యపదజాలంతో దూషించడం, తనపై చెప్పులు విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెంగళూరులోని నగర్వాకు చెందిన ప్రియా చౌహాన్ మూడేళ్లుగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుండగా.. అబ్యూజర్స్‌పై కేసు నమోదైంది. కాగా ఈ వీడియోను షేర్ చేసిన యాంకర్ రష్మి గౌతమ్.. ఒక మంచి పని చేస్తున్నందుకు కూడా మహిళ సమాజంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటే ఎలా ఉమెన్స్ డే జరుపుకుంటామని ప్రశ్నిస్తోంది.
‘సమాజంలో మహిళకు గౌరవం లభించేంతవరకూ ఉమెన్స్ డే సంతోషంగా జరుపుకోలేను. ఒక పురుషుడు బహిరంగంగా మహిళను తిడుతుంటే.. తనను బిచ్ అని పిలుస్తుంటే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆమెపైకి చెప్పులు విసురుతూ నిందిస్తుంటే ఏ విధంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి. మానవత్వం ప్రతీ మానవుడిని సమానంగా చూస్తుంది కానీ ఇలాంటి మార్పు ఎప్పుడు వస్తుంది?’ అని ప్రశ్నించింది రష్మి.
Until the day this does not change what is the point of "WOMEN'S DAY"
it's nothing but a day https://t.co/lV4tFgGbLr— rashmi gautam (@rashmigautam27) March 8, 2021