యాంకర్ ప్రదీప్ మూవీ ట్రైలర్ రిలీజ్

by Shyam |   ( Updated:2023-12-17 15:02:29.0  )
యాంకర్ ప్రదీప్ మూవీ ట్రైలర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా’. మున్నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఓ వైపు అంద‌మైన సెల‌యేళ్లు, మ‌రోవైపు కాలేజీ..ఇలా రెండు బ్యాక్ డ్రాప్‌ల‌తో ప్రారంభ‌మైంది ట్రైల‌ర్‌. ‘అబ్బ ‌నువ్వొదిలే ఆ ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే’ అంటూ ప్ర‌దీప్ మాచిరాజు, అమృత‌తో చెప్పే సంభాష‌ణ‌లతో మొద‌ల‌వగా..ఆ త‌ర్వాత కాలేజీలో జ‌రిగే ఫ‌న్‌, రొమాంటిక్ సన్నివేశాల‌తో సీరియ‌స్‌గా సాగుతు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’అనే పాట సోష‌ల్ మీడియాలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎస్వీ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. లవ్ స్టోరీకి పునర్జన్మల నేపథ్యం జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు మున్నా. ఆ జన్మలో కలవని జంట..ఈ జన్మలో ఎలా కలిశారనే కాన్సెప్టుతో సినిమా వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది.

Advertisement

Next Story