- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ యాంకర్ కమ్ నటి ఫేస్ బుక్ హ్యాక్.. ఆ పోస్ట్ లు పెట్టి టార్చర్
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా లో సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు. సెలబ్రెటీల అకౌంట్లను హ్యాక్ చేస్తూ అభ్యంతర పోస్టులను పెడుతూ వారికి ఇబ్బందిని కలిగిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఒక స్టార్ యాంకర్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. టాలీవుడ్ యాంకర్ కమ్ నటి గాయత్రి భార్గవి ఫేస్ బుక్ అకౌంట్ ని గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అందులో వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకరమైన సందేశాలను పోస్ట్ చేయడంతో గాయత్రికి పలువురు నుండి మెసేజ్ లు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ మాట్లాడుతూ ” ఇటీవల హ్యాకర్స్ ఎక్కువైపోయారు.. ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి వారు పెట్టినట్లు అభ్యంతరకర పోస్ట్ లను పెట్టి వారి పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. అందుకే ప్రముఖులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు కొత్త పాస్ వర్డ్ లను మారుస్తూ ఉండాలని తెలిపారు. గాయత్రి ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిన వారిని పట్టుకొంటామని అన్నారు.