మాల్దీవుల సాక్షిగా ఒక్కటైన బాలీవుడ్ లవ్‌బర్డ్స్.. వీడియో వైరల్

by Shyam |   ( Updated:2023-03-30 17:45:08.0  )
మాల్దీవుల సాక్షిగా ఒక్కటైన బాలీవుడ్ లవ్‌బర్డ్స్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: అనన్య పాండే సిస్టర్ అలన్నా పాండే శుక్రవారం తన నిశ్చితార్థం జరిగినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఆమె ప్రియుడు ఐవర్ మెక్‌క్రే తనకు మాల్దీవుల్లో ప్రపోజ్ చేసినట్లు చెప్పిన అలన్నా.. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను తన అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అలన్నాకు తన ప్రేమను ప్రపోజ్ చేసిన ఐవోర్ మెక్‌క్రే.. బీచ్‌లో గుండె సింబల్ మధ్య నిలబడి ఆమెకు ప్రపోజ్ చేస్తూ ‘నన్ను పెళ్లి చేసుకో’ అని ఇసుకలో రాశాడు.

అది చూసి షాక్ అయిన అలన్నా.. అతడి ప్రేమను అంగీకరిస్తూ మైక్‌క్రే‌కు ముద్దుతో వెల్‌కమ్ చెబుతూ.. ‘నేను నిన్ను కలిసే వరకు మరో మనిషిని ఇంతగా ప్రేమించడం సాధ్యమని గ్రహించలేదు. ప్రతిరోజూ నన్ను నవ్వించినందుకు, నిజాయితిగా నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. నువ్వు నిజంగా నన్ను ఈ రోజు ఆనందంలో ముంచేత్తావు. ఐవోర్ నేను నీతో కుటుంబ సంబంధాన్ని పంచుకోవడానికి ఇక వేచి ఉండలేను’ అని చెప్పడం విశేషం.

అలాగే లవ్ ప్రపోజ్ గురించి వివరించిన ఐవోర్.. ‘రెండేళ్ళ నుంచి ఈ సమయం కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నా.. అలన్నా నీపై ప్రేమను నాలో దాచుకోలేకపోయాను. నిన్ను బీచ్‌లో లవ్ సింబల్ దగ్గరకు తీసుకొచ్చేసరికి నా గుండె డోలులా కొట్టుకుంది. నా అరచేతుల్లో పూర్తిగా చెమటలు పట్టాయి. ఏ క్షణంలోనైనా నీవు గుర్తు‌పట్టొచ్చని భయం వేసింది. కానీ నీ గుండెల్లో నాకు చోటుందని తెలుసుకున్నాకా.. చాలా భావోద్వేగానికి లోనయ్యాను. నిజంగా నీ ప్రేమే నాకు సర్వస్వం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అలాన్నా’ అని రాసుకొచ్చాడు.

ఇక ఈ ప్రేమ జంటను చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేయగా.. బాలీవుడ్ నటి ఆలియా స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్.. నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటే.. బిపాసా బసు ‘మంచి తీపి కబురు చెప్పారు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు’ అని స్పందించింది.

Advertisement

Next Story