తెలుగులో డబ్బింగ్ చెప్తా: అనన్య

by Shyam |
తెలుగులో డబ్బింగ్ చెప్తా: అనన్య
X

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. తాజాగా సౌత్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కరణ్ జోహార్, చార్మి నిర్మాతలు కాగా లైగర్, ఫైటర్ టైటిళ్లను పరిశీలిస్తున్నారు. ఈ మధ్యే హైదరాబాద్‌లో జరిగిన షెడ్యుల్‌లో జాయిన్ అయిన అనన్య తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది. అందమైన, తెలివైన అమ్మాయి పాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఈ ప్రెట్టీ హీరోయిన్ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పింది. అంతేకాదు తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. పాన్ ఇండియా మూవీ కాబట్టి వీలైనన్ని భాషలు నేర్చుకునేందుకు ట్రై చేస్తున్నానని చెప్పింది. కాగా, తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’కు బెస్ట్ డెబ్యూట్ ఫీమేల్ యాక్ట్రెస్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అనన్య ఆ తర్వాత ‘పతీ పత్నీ ఔర్ వో’ సినిమాలో నటించింది. ప్రస్తుతం విజయ్ మూవీతోపాటు ‘కాలీ పీలి’ సినిమాతో బిజీగా ఉంది.

Advertisement

Next Story