- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లైగర్’ పేరు చెప్తే నెర్వస్‌గా ఫీలవుతున్న అనన్య పాండే
దిశ, సినిమా : పూరీ జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చార్మి కౌర్, అపూర్వ మెహతా, యశ్ హిరూ జోహార్ కలిసి నిర్మిస్తుండగా.. ఈ చిత్రం ద్వారా సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది భామ. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ టీజర్‌లో తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న అనన్య.. ఈ చిత్రం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుండటం పట్ల మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చింది.
వాస్తవానికి రెండేళ్ల క్రితం హిందీ పరిశ్రమలో అడుగుపెట్టిన తాను.. ఈ చిత్రం ద్వారా ఒకేసారి నాలుగు పరిశ్రమలకు పరిచయం అవుతుండటం హ్యాపీగా ఉందని.. ఎట్ ఏ టైమ్ నాలుగు రెట్లు నెర్వస్‌గా కూడా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ఇదంతా చూస్తుంటే ప్రపంచం చిన్న ప్రదేశంగా మారిందనిపిస్తోందని చెప్పింది. భారత్ విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, విభిన్న భాషల మిళితంగా ఉందని, ప్రేమతో నిండిపోయిందని తెలిపింది. అందుకు అనుగుణంగా ప్రజలకు ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు బిగ్ స్క్రీన్ మాత్రమే కాదు ఓటీటీ కూడా డెవలప్ అవుతుండటంతో సినిమా అవకాశాల సంఖ్య పెరుగుతోందని అభిప్రాయపడింది. భాషకు సరిహద్దులు లేవని.. విభిన్న భాషలు, ప్రాంతాలకు చెందిన ప్రజలను ఆకట్టుకునేందుకు ఎగ్జైటింగ్ గానూ, హక్కుగానూ భావిస్తున్నట్లు తెలిపింది.