కరోనా రోగులను పరామర్శించిన కలెక్టర్

by srinivas |
కరోనా రోగులను పరామర్శించిన కలెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు హిందూపురంలో పర్యటించారు. కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ రోగులను అడిగి తెలుసుకున్నారు. హిందూపురం జిల్లా ఆస్పత్రిని పూర్తిగా కోవిడ్ ఆస్పత్రిగా మార్చామని ఆస్పత్రిలోని పాత బ్లాక్, కొత్త బ్లాక్ లలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మొత్తం ఐసీయూ, నాన్ ఐసీయూ కలిపి 280 బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. కరోనా రోగులకు అందించే ఆహారం సరఫరాలో ఎటువంటి ఆలస్యం చేయరాదని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed