- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ జ్యోతిష్యుడు సేఫ్ : ఆనంద్ మహీంద్రా
దిశ, వెబ్‌డెస్క్: 46వ అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక ఈసారి చాలా రసవత్తరంగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా చరిత్రలోనే బిగ్గెస్ట్ పోల్ నమోదైంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే జ్యోష్యాలు కూడా విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఓ జ్యోతిష్యుడు.. ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని వెల్లడించాడు. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.
అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సెలెబ్రిటీలంతా అమెరికా ప్రజల అభీష్టాన్ని స్వాగతిస్తూ.. గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టారని అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, అమెరికా ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ట్రంప్ గెలుపు కష్టమని తేల్చాయి. కానీ ఓ జ్యోతిష్యుడు మాత్రం.. ఈ సారి అధ్యక్ష పీఠం ట్రంప్‌దే, అందులో ఎలాంటి అనుమానం లేదంటూ ఏవో గ్రహాల లెక్కలు వేసి మరీ చూపించాడు. అతడు చెప్పిన జ్యోతిష్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది కూడా. కాగా ఆనంద్ మహీంద్రా మరోసారి ఆ విషయం గురించి ట్వీట్ చేశాడు. ‘ఆ జోతిష్యుడు తన ప్రైవసీ కోసం తన పేరును బయటపెట్టనందుకు సంతోషంగా ఉంది. ఒకవేళ ట్రంప్ తిరిగి పదవిలోకి వస్తే.. ఈ జ్యోతిష్యుడు పాపులర్ అయ్యేవాడు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ మరోసారి వైరల్‌గా మారింది.
https://twitter.com/anandmahindra/status/1323910321472376837
అయితే ఆ జ్యోతిష్యుడి సంగతి పక్కన పెడితే.. జో బైడెన్ గెలుస్తాడని ఓ సైబీరియా ఎలుగుబంటి చెప్పిన జోస్యం మాత్రం నిజమైంది. 2016 ఎన్నికల్లో కూడా ఈ ఎలుగుబంటి చెప్పినదే నిజమై హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. అంతేకాదు సైబీరియాలోని క్రాస్నోయార్స్క్‌లోని రాయెవ్ రోచీ జూలో నివసిస్తున్న రెండు పులులు కూడా జో గెలుస్తాడనే జోస్యం చెప్పాయి.