వైరల్‌గా ఆనంద్ మహీంద్రా టైగర్ వీడియో!

by Shamantha N |   ( Updated:2020-12-20 05:26:45.0  )
వైరల్‌గా ఆనంద్ మహీంద్రా టైగర్ వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ‘మండే మోటివేషన్’ పేరిట ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్‌స్పైరింగ్ మెసేజ్‌లు, స్టోరీలు షేర్ చేసే ఆనంద్ జీ.. సోమవారం ఒక్కరోజే కాకుండా నార్మల్ డేస్‌లోనూ తనకు నచ్చిన వీడియోలు, మెసేజ్‌ల ద్వారా యూత్‌కు సందేశమిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

నాగర్‌హోల్ అభయారణ్యంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను కోఆర్గ్‌లోని తన సోదరి ఆయనకు షేర్ చేసిందన్నారు. ఆ వీడియోలో ఓ ఏనుగు.. ప్రకృతి ఒడిలో ఆనందంగా నిలబడి ఉంది. నేల మీద ఉన్న పచ్చిక బయళ్లను తన తొండంతో తాకుతూ ఏదో తింటుండగా, దాని వెనకున్న చెట్ల పొదల్లో ఓ టైగర్.. ఆకలిగా చూస్తున్న దృశ్యం కనిపించింది. కాగా ఆ టైగర్ నెక్ట్స్ ఏం చేయబోతుంది? అని తెలుసుకునే లోపు వీడియో అయిపోతుంది.

పులి ఏనుగు మీద దాడిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్న ఈ వీడియోతో విలియమ్ బ్లేక్ అనే ప్రముఖ రచయిత రాసిన ‘టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్..’ పోయెమ్‌ను జత చేశారు ఆనంద్ మహీంద్రా. కాగా ఈ వీడియో నెటిజన్లలో భిన్న ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఏనుగు తోక చూసి టైగర్ షాకైందంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా.. టైగర్ నెక్స్ట్ ఏం చేసిందో? అని ఇంకొంతమంది చర్చించుకుంటున్నారు. ఈ వీడియో షూట్ చేసిన వ్యక్తి తప్పకుండా భయపడే ఉంటాడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Next Story