‘ఆనంద’మానందమాయె..!

by Shamantha N |
‘ఆనంద’మానందమాయె..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లోకెక్కారు. సామాజిక మాధ్యమాల్లో ఆలోచింపజేసే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఇప్పుడు మరోసారి తాజాగా ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. అంతేకాదు ఆ వీడియోలో ఉన్న ఉపాధ్యాయురాలిని అభినందించారు. విషయమేమిటంటే.. పుణెలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై బైక్ నడుపుకుంటూ ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అయితే ఇది గమనించిన గోఖలే అనే ఉపాధ్యాయురాలు అతడిని అడ్డుకున్నది. ఇలా ఫుట్ పాత్ పై కాదు రోడ్లపై బైక్ నడపాలని అతడికి ఆమె సూచిందింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ అయ్యింది. అలా వైరల్ అవుతూ ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఇది గమనించిన ఆయన ఆ వీడియోను షేర్ చేస్తూ ఆమెను అభినందిస్తూ కామెంట్ చేశారు. వీడియోను చూడగానే ఆమె తెగువకు ప్రశంసలు కురిపిస్తూ ఇలాంటివారి వల్లే ప్రపంచం సురక్షితంగా ఉందని పేర్కొంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ఉపాధ్యాయురాలిని సత్కరించాలని, లేదా అంతర్జాతీయ ఆంటీల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని మహింద్రా కామెంట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ వీడియోను చూడగానే నేను ఆంటీలకు అభిమానిని అయ్యానని కూడా ఆయన పేర్కొన్నారు.

Tags : anand mahendra, aunty, twitter post ,Anand Mahindra praises Pune woman ,who took on bikers riding on footpath,

Advertisement

Next Story

Most Viewed