మిడిల్ క్లాస్ హీరోకు వరుస సినిమాల ఆఫర్

by Jakkula Samataha |
మిడిల్ క్లాస్ హీరోకు వరుస సినిమాల ఆఫర్
X

దిశ, సినిమా : ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆనంద్ దేవరకొండ, తన రెండో చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ అనే కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్న ఈ మిడిల్ క్లాస్ హీరోకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. కాగా సోమవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్.

‘పుష్పక విమానం’ చిత్రం తర్వాత ఆనంద్.. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా చేయనుండగా, మధుర ఎంటర్టైన్మెంట్స్, రోల్ కెమెరా విజువల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదే క్రమంలో హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందనున్న చిత్రంలో ఆనంద్ నటించనున్నాడు. డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శెట్టి తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

Advertisement

Next Story