- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
దిశ, దామరచర్ల: గత కొన్నిరోజులుగా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామపంచాయతీ పరిధిలో భిక్షాటన చేసుకుంటూ జీవనం గడుపుతున్న గుర్తుతెలియని వృద్ధుడు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని వాడపల్లి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రపోల్ గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిని గుంటూరు వైపు వెళ్తున్న ఏపీ07డీడబ్ల్యూ1126 అను నెంబర్ గల కారు టక్కరించి వెనుక నుండి ఢీ కొట్టడంతో తలకు,కాళ్ళు, చేతులకు బలమైన గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. కారు డ్రైవర్ కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని అన్నారు. మృతునికి సుమారు 50 నుండి 60 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించామని, ఎవరైనా గుర్తిస్తే 9440795607,7901156191,7901158709 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.