- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మా అమృత.. ఆస్తి కోసమేనా ఇదంతా?
దిశ, నల్లగొండ :
మారుతీరావు ఆత్మహత్య అనంతరం అమృతకు, ఆమె బాబాయ్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన తండ్రి చనిపోవడానికి కారణం బాబాయ్‌తో ఉన్న ఆస్తి తగాదాలే అని అమృత వెల్లడించింది. దీనిపై మీడియా శ్రవణ్‌ను ప్రశ్నించిగా స్పందించిన ఆయన ప్రణయ్ హత్య తర్వాత.. తన అన్నయ్య ఆత్మహత్య చేసుకునే వరకు ఉరితీయాలని డిమాండ్ చేసిన అమృత ఒక్కసారిగా తన తల్లి గిరిజపై ప్రేమ ఒలకబోయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ఇష్టం, అది ఇప్పుడు అందరూ చూశారు కదా? అలాంటిది కన్నతండ్రి చనిపోతే శుభ వార్త అన్న ఆమె, ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తిపై ప్రేమ పుట్టి డబ్బు కోసం డ్రామాలు మొదలు పెట్టిందన్నారు.
అంతేకాకుండా తన వల్ల ఆమె తల్లి గిరిజకు అపాయం పొంచి ఉందని చెప్పడం అవివేకమని మారుతీరావు సోదరుడు శ్రవణ్ చెప్పారు. తన వల్ల అపాయం ఉందని రుజువు చేస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. నాన్న అని పిలవడానికి కూడా అమృతకు మాటలు రావడం లేదని, నిజంగా తల్లి మీద ప్రేమ ఉంటే తన తండ్రి మరణవార్త విన్నాక వెంటనే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అమృత చేసిన చెత్త పనికే తన సోదరుడు బలవన్మరణం చేసుకున్నాడని శ్రవణ్ ఆరోపించారు. కన్నతల్లి మెడలో నుంచి పుస్తెలతాడు తిస్తేనే తానూ తీస్తా అన్న అమృతకు మెచురిటీ లేదన్నారు. దయచేసి మీడియా అమృతను ఎక్కువగా ఫోకస్ చేయవద్దని కోరారు.
అమృతకు వాళ్ల అమ్మతో కలసి ఉండాలని ఉంటే ఉండవచ్చని, తనకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. కూతురే సర్వస్వం అనుకున్నతండ్రిని కోల్పోవడం ఆమె దురదృష్టమని వివరించారు.తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, మారుతీరావుకు చెందిన ఒక్క రూపాయి కూడా అవసరం లేదన్నారు. అన్నతో తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, తగాదాలు లేవని శ్రవణ్ స్పష్టం చేశారు.తన సోదరుడు ఎవరికైనా బాకీ పడితే వారికి తాను చెల్లింపులు చేస్తానని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ప్రణయ్ హత్యతో తనకు సంబంధం లేకున్నా అన్యాయంగా జైలుకు పంపించారనే ఆవేదన తప్ప మరొకటి కాదన్నారు.
Tags : amruta vs sravan, maruthi rao sucide, girijaa, asset disputs , plz media dont focus amruta